కవిచంద్రా శ్రీ మద్ధా సత్యనారాయణ గారు ఆకస్మిక మరణం
ప్రముఖ పద్య కవి కవి చంద్ర మద్దా సత్యనారాయణ ఆకస్మిక మృతి!
తూర్పు గోదావరి జిల్లా, కరప మండలం గురజనా పల్లి కి చేందిన ప్రముఖ పద్య కవి మద్దా సత్యనారాయణ భారత వైమానిక దళం లో చిరు ఉద్యోగి గా చేరి, పట్టుదల తో ఉన్నత విద్యలు అభ్యసించి సాహిత్యం మీద ఆశక్తి తో పద్యం మీద పట్టు సాధించి అనేక శతకాలు రచించారు! అమలాపురం నుండి హైదరాబాదు దాకా ఏక్కడ సభకు ఆహ్వానం వచ్చినా రేక్కలు కట్టుకుని వాలి పోయేవాడు!పద్యం రాయడం లోనే కాదు రాగయుక్తంగా, శ్రవణ శుభ గత్వంగా ఆలాపించడo ఆయన ప్రత్యేకత! మణి పూసలు వంటి లఘు కవితా ప్రక్రియ లోనూ కృషి చేసి పుస్తకం తేచ్చారు.ప్రయోగ శీలి అయిన మద్దా పది కవిత్వ ప్రక్రియల్లో ' ఆశాజ్యోతి అంబేద్కరు ' పేరుతో కావ్యం రచించారు. కవి సంధ్య నిర్వహించిన అనేకసాహిత్య కార్యక్రమాల్లో మద్దా ఉత్సాహం గా పాల్గోన్నారు