Friday, 8 April 2022

Kakinada New Commissioner Ch Narasimha Rao (FAC)

 కాకినాడ  నగరపాలక సంస్థ కమిషనర్ (FAC) గా శ్రీ సి హెచ్ నాగ నరసింహారావు

Kakinada New Commissioner  Ch   Narasimha Rao (FAC)

 Ch Naga Narasimha Rao on Friday took charge as Additional Commissioner of Kakinada Municipal Corporation  

 కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ( FAC) గా శ్రీ సిహెచ్  నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు పురపరిపాలనా శాఖ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్  శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం కమిషనర్ గా పనిచేసిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ కమిషనర్ గా  బదిలీ కావడంతో అదనపు  కమిషనర్ గా ఉన్న నాగ నరసింహారావును పూర్తి అదనపు  బాధ్యతలతో కమిషనర్ గా నియమించారు. శుక్రవారం సాయంత్రం ఆయన FAC కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎస్ ఈ సత్య కుమారి, మేనేజర్ సత్యనారాయణ, ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్వి చరణ్, RO రమణ, డీసీపీ శ్రీనివాస్, కార్యదర్శి ఏసుబాబు, గణాంక అధికారి శ్రీ కె ఎస్ శిరీష్ కుమార్ , తదితరులు  అభినందించారు.