Friday, 5 March 2021

వ్యాక్సిన్ తోనే కరోనా వైరస్ నివారణ

 వ్యాక్సిన్ తోనే  కరోనా వైరస్  నివారణ

 కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు   ఒక్క వైరస్ తోనే సాధ్యమని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా  అని ఎదురు చూశామని కానీ నేడు అందుబాటులోకి వచ్చిన తర్వాత   మీనమేషాలు  లెక్కించడం తగదన్నారు . వ్యాక్సిన్ వేయించుకోవడం వలన యాంటీ బాడీస్ వృద్ధిచెందుతాయి అన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 250 లు చెల్లించాల్సి ఉందన్నారు.    వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి అని     భౌతిక దూరం పాటించాలని డాక్టర్   సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, బాపిరాజు,  రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment

Please post your valuable comments