Sunday, 7 March 2021

రాష్ట్ర స్థాయి షూటింగ్ కు కాకినాడ అమ్మాయి ఎంపిక లోకజ్ఞాను అభినందించిన కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్

 రాష్ట్ర స్థాయి షూటింగ్ కు కాకినాడ అమ్మాయి ఎంపిక


లోకజ్ఞాను అభినందించిన కాకినాడ  కమిషనర్ స్వప్నిల్ దినకర్


తూర్పుగోదావరి జిల్లా కాకినాడ... రాష్ట్ర స్థాయి షూటింగ్ కు  క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి.రాజ్ కుమార్ తెలిపారు. గత నెల 24 నుంచి 27 వ తేదీ వరకు హైదరాబాద్లోని అంతర్జాతీయ షూటింగ్ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల రైఫిల్ , ఎయిర్ పిస్తోల్ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఉమెన్ యూత్ జూనియర్ కేటగిరీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వంక.లోకజ్ఞ కాంస్యం  పతకం సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావడం గర్వకారణమని కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అభినందించారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకజ్ఞ బంగారు పతకం సాధించాలని కమీషనర్ కొనియాడారు.






No comments:

Post a Comment

Please post your valuable comments