నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి మనం ఎంత సంపాదిస్తున్నా మనే దానికన్నా ఎంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నాము అనేది ముఖ్యమని వ్యాయామ శిక్షకులు పీ త్రినాథ్ పేర్కొన్నారు. రమణయ్యపేట లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం క్రమంగా పెరిగిందన్నారు. దీంతో మనం మందుల్ని పల్లెల్లో పెట్టుకొని తింటున్నట్లు అని అన్నారు .రోగనిరోధకశక్తిని కలిగి ఉండడానికి ప్రకృతి సేద్యం పద్ధతి లో పండించిన ఆహారపదార్ధాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాజా, సుబ్రహ్మణ్యం, బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.