Showing posts with label news kakinada. Show all posts
Showing posts with label news kakinada. Show all posts

Wednesday, 3 March 2021

సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో - ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ ప్రసాద్

 సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదని కానీ వీటి వలనే రోజు రోజుకి వినికిడి సమస్యలు అధికమవుతున్నాయి  అని ప్రముఖ   ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ  ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో  బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శక్తివంతమైన స్మార్ట్ఫోన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం వలన వాటినుండి   అధిక రేడియేషన్ విడుదలై వినికిడి లోపం వస్తుందన్నారు. ఆధునిక జీవనశైలి ,పోషకాహార లోపం, మానసిక ఒత్తిళ్లు కూడా వినికిడి పై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఎక్కువ సమయం సెల్ఫోన్లలో  మాట్లాడ రాదన్నారు. చెవిలో నూనె వేయడం , ఇతర వస్తువులు పెట్టి  చెవిలో తిప్ప రాదని డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. అనంతరం హియరింగ్ కేర్ సెంటర్ ఆడియాలజిస్టు ఎన్ శ్రీను నాయక్ వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ గుబ్బల లక్ష్మన్న ప్రసాద్ , ఎన్ శ్రీను నాయక్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేలింగి బాపిరాజు, డి సుబ్రహ్మణ్యం, రాజా, పీ. త్రినాథ్, శ్రీ వాణి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు .



#ent #entdr #entdrkakinada #kakinada #kainadanews