ప్రతినిత్యం ఆనందంగా గడపాలి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ఆనందంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలని ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్ ఏ పి జి విను పేర్కొన్నారు. రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మనిషి జీవితంలో ప్రతిక్షణం విలువైనది అన్నారు. జీవితంలో సమస్యలు సహజమని అయితే ఆనందమే జీవిత పరమావధి కాబట్టి విద్యార్థి దశలో చక్కగా విద్య అభ్యసిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంటూ ఆనందంగా జీవించాలని అన్నారు. చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలన్నారు. వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ఎప్పుడు సానుకూల దృక్పథంతో మెలగాలని విను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజకుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి , వాలంటీర్లు పాల్గొన్నారు.
#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #nssunit #nssswamycollege #nssnews #psychologistapjvinu #vinu #apjvinu #ratnaprasadkakinada