Showing posts with label eye donation. Show all posts
Showing posts with label eye donation. Show all posts

Thursday, 4 March 2021

నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ

 నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల    ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వాలంటీర్లు నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజ్ కుమార్  మా ట్లాడుతూ జీవించినంత కాలం కంటి చూపును   అనుభవించాం కాబట్టి  మరణానంతరం నేత్రదానం చేయడం వలన మరో ఇద్దరికీ కంటిచూపును ప్రసా దించినట్లు       కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలన్నారు. ఏ వయసు వారైనా  నేత్రదానం చేయవచ్చన్నారు.    మధుమేహం, బిపి ఉన్న వారితో పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, జి కృష్ణ మోహన్, ఎన్ ఎస్ ఎస్ అధికారి,   వాలంటీర్లు పాల్గొన్నారు