Wednesday, 6 April 2022
Saturday, 13 March 2021
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయండి ఐ. వి. వినతి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయండి...
ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిపించండి...
జిల్లా కలెక్టర్, ఎస్.పి. లకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ. వి. వినతి...
ప్రలోభాలు, వత్తిడి లను లెక్కచేయకుండా ఉభయగోదావరి జిల్లాల అధ్యాపక, ఉపాధ్యాయ ఓటర్లు పెద్దల సభ ఔన్నత్యాన్ని, ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసిన ఐవి.....
కాకినాడ, మార్చి 13; మార్చి 14 న జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసి , ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్.పి. లకు ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐ.వి.) వినతి పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ మార్చి 12 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం గంధం నారాయణరావు అనే అభ్యర్థికి చెందిన కొంతమంది వ్యక్తులు ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కార్లలో, ఆటోలలో ట్రావెలింగ్ బ్యాగ్ లు వేసికొని ఎమ్మెల్సీ ఓటర్లకు పంపిణీ చేస్తూ ప్రలోభ పరుస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ, అమలాపురం, రావులపాలెం వంటి ప్రాంతాల్లో తమ కార్యకర్తలు పంపిణీలను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే కొన్ని చోట్ల బ్యాగ్ లు పంపిణీ చేస్తున్న వ్యక్తులే తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వాపోయారు. ఈరోజు, రేపు కూడా బ్యాగులు, నగదు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నామన్నారు. అలాగే పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద కొంత మంది అలజడి సృష్టించే అవకాశం ఉందని, దానిని నిరోధించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఐవి కోరారు. కలెక్టర్, ఎస్.పి. లతో ఫోన్ లో మాట్లాడగా తగిన చర్యలు తీసుకుంటామని , యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పెట్రోలింగ్ చేయిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం లో డిఆర్ఓ సిహెచ్. సత్తిబాబు కు, ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ అంబికా ప్రసాద్ కు స్వయం గా వినతి పత్రాలు సమర్పించారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, వత్తిడి చేసినా ఉభయగోదావరి జిల్లాల అధ్యాపక, ఉపాధ్యాయులు పెద్దల సభ ఔన్నత్యాన్ని, ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెడతారని ఐవి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పలివెల వీరబాబు, టి. రాజా, మణికంఠ, దినేష్ తదితరులు పాల్గొన్నారు...
అమలాపురంలో కొనసాగుతున్న కరోనా ప్రభావం కొత్తగా మరో 3 కేసులు నమోదు
అమలాపురంలో కొనసాగుతున్న
కరోనా ప్రభావం కొత్తగా
మరో 3 కేసులు నమోదు
అమలాపురం లోని స్థానిక విద్యుత్ నగర్ లో 2, మెట్ల కాలనీలో 1, కరోనా కేసులు నమోదయ్యాయి
మొత్తం ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అమలాపురం మున్సిపల్ కమీషనర్ నాయుడు.
Sunday, 7 March 2021
ఇంద్రపాలెం వంతెన వద్ద శ్రమదానం తో గుంతలను పూడ్చిన డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు
ఇంద్రపాలెం వంతెన వద్ద శ్రమదానం తో గుంతలను పూడ్చిన డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు....
ఇంద్రపాలెం మీదుగా భారీ వాహనాల రాకపోకలు నిషేధించి, రోడ్ నిర్మించాలని డిమాండ్....
కాకినాడ రూరల్, మార్చి 7; కాకినాడ - జి. మామిడాడ రోడ్ లో ఇంద్రపాలెం వంతెన వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) కార్యకర్తలు శ్రమదానం తో శనివారం రాత్రి పూడ్చారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కట్టా శ్యామ్ శేఖర్ మాట్లాడుతూ సామర్లకోట రోడ్ నుండి రామచంద్రాపురం, యానాం రోడ్ ల వైపు వెళ్ళవలసిన భారీ వాహనాలు, టిప్పర్ లు ఇంద్రపాలెం మీదుగా చీడిగ వద్ద నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 216 కు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ఇంద్రపాలెం గ్రామంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఒక మహిళ కూడా మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు ఇంద్రపాలెం వంతెన వద్ద మలుపు తీసుకోవడం తో పెద్ద పెద్ద గుంతలు పడి చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. చాలా సార్లు అధికారులకు విన్నవించాక ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ వారి డ్యూటీ సమయం లో వెళ్ళే వాహనాలను మళ్ళిస్తున్నారని వచ్చే వాహనాలు ఆగడం లేదన్నారు. అలాగే రాత్రి 9 గం. నుండి ఉదయం 9 గం. ల మధ్యలో వాహనాలు గ్యాస్ హారన్ లతో అత్యంత వేగంగా నడుపుతున్నారని, వీటికి అడ్డు కట్ట వేయాలని అధికారులను కోరుతున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తమ వంతు గా శ్రమదానం తో గుంతలను పూడ్చుతున్నామని , ఇది తాత్కాలిక పరిష్కారమేనని , శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో విస్తృత ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కృషి ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గుండుబోగుల శ్రీనివాస్, కె. సూర్య, సిహెచ్. విజయ్ కుమార్, సిహెచ్. త్రిమూర్తులు,గవర బాబ్జీ, వాసు దొరబాబు, శ్రీనివాస్, వి. రవి కుమార్, రోహిత్, కెవిపిఎస్ కార్యకర్త జి. సత్యానందం, మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు....
Friday, 5 March 2021
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో బంద్ చేయిస్తున్న సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో బంద్ చేయిస్తున్న సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ల నాయకులు..... ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను నేటి తరం ఉద్యమాలతో కాపాడుకోవాలని పిలుపు.... విశాఖ ఉక్కు పరిశ్రమ కు సొంత ఘనులు కేటాయించాలని డిమాండ్.... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపద ను కార్పొరేట్ లకు దోచిపెడుతున్న బిజెపి మోడీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్న కేంద్ర పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు.....ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్. విజయ్ కుమార్, గుండుబోగుల శ్రీనివాస్, వాసంశెట్టి చంద్రరావు, ఆమ్ ఆద్మీ నాయకులు నరాల శివ, కృష్ణ మోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు...
570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్ఈసీ. Elecion news update
570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్ఈసీ.
నగర పాలక, పురపాలిక, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది....
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన నేపథ్యంలో... నగరపాలక, పుర, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20.68 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా వైకాపా అత్యధిక స్థానాలు దక్కించుకుందని ఎస్ఈసీ వివరించింది.
అధికార పార్టీ జోరు .
వైకాపా 570 స్థానాల్లో పాగా వేయగా తెదేపా ఐదు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఒక చోట భాజపా, రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఈసీ తెలిపింది..
Kakinada Bandh March 5 Against Steel Plant Privatization
కాకినాడ భానుగుడి సెంటర్ లో బంద్ ర్యాలీ దృశ్యం.....
Thursday, 4 March 2021
వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడంతో వృద్ధులకు భద్రత కరువైందని అయినా పలు చట్టాల ద్వారా వీరికి రక్షణ కల్పించబడింది అని న్యాయవాది కే. శ్రీ రామ రాజు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిల్లల ఉన్నత కోసం పడిన తపన చేసిన కృషిని పిల్లలు గుర్తించడం లేదన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే వారి నుంచి నెల నెల కొంత మొత్తాన్ని భరణంగా పొందవచ్చన్నారు. భరణాన్ని చెల్లించకపోతే వారి సంతానానికి జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు .చట్టాల ద్వారా వృద్ధులకు రక్షణ ఉన్నా నేటి యువతలో పెద్దలను గౌరవించాలి అనే నైతిక పునాది అవసరమని శ్రీ రామ రాజు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రమణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి తదితర వాకర్స్ పాల్గొన్నారు.
వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్
వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్ -అనిత దంపతుల సౌజన్యంతో పేద కుటుంబానికి చెందిన వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ సృష్టిలో అన్ని జీవులకన్నా మానవ జన్మ మహోత్కృష్టమైనదని దీనిని సార్థకం చేసుకోవడానికి గాను మానవసేవే మాధవ సేవగా సేవలు అందించాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ సురేష్ అనిత ల వివాహ దినోత్సవ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనలతో పాటు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
APP in Kakinada - APP Voluntaries , Actively Participated in todays State Bandh , Against Privatization of Vishaka Steel Plant
APP in Kakinada - APP Voluntaries , Actively Participated in todays State Bandh , Against Privatization of Vishaka Steel Plant
కాకినాడ లో స్టీల్ ఫ్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా బంద్ కు మద్దతుగా (అప్ )ఆమ్ఆథ్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల .శివ , కాళ్ళూరి కృష్ణమెహన్ ట్రైజరర్ &సేక్రటరి, జిల్లా నాయకులు నాగులపాటి.సుబ్రహ్మణ్యం అమ్మి రెడ్డి,ఆకెళ్ళ.లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు…
నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ
నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వాలంటీర్లు నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ మా ట్లాడుతూ జీవించినంత కాలం కంటి చూపును అనుభవించాం కాబట్టి మరణానంతరం నేత్రదానం చేయడం వలన మరో ఇద్దరికీ కంటిచూపును ప్రసా దించినట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలన్నారు. ఏ వయసు వారైనా నేత్రదానం చేయవచ్చన్నారు. మధుమేహం, బిపి ఉన్న వారితో పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, జి కృష్ణ మోహన్, ఎన్ ఎస్ ఎస్ అధికారి, వాలంటీర్లు పాల్గొన్నారు
Wednesday, 3 March 2021
జులై 12 నుంచి ఎంసెట్AP EAMCET 2021 - Exam Date
జులై 12 నుంచి ఎంసెట్
బైపీసీ స్ట్రీమ్ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
* అమరావతి:*
ఏపీ ఎంసెట్ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.
మిగతా పరీక్షల్లో కొంత జాప్యం
ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.
ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు
ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.
చిగుళ్ల వ్యాధి ని అశ్రద్ధ చేయరాదు మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే దంతాలు ముఖ్యం కాబట్టి చిగుళ్ల వ్యాధి వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి సహజ దంతాలను కాపాడుకోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో ఆ గ్రామ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మెనోపాజ్ దశలో మహిళలను చిగుళ్ల సమస్యలు వేధిస్తాయి అన్నారు. ఈ దశలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ స్థాయిలో విడుదలవుతుందని తద్వారా నోరు పొడిబారి దుర్వాసన వస్తుంది అన్నారు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు. సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, సంఘ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు
#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news #ratnaprasadkakinada