Showing posts with label kainada. Show all posts
Showing posts with label kainada. Show all posts

Thursday, 4 March 2021

విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.

 విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.

పత్రికా ప్రకటన బార్ అసోసియేషన్ జిల్లా కోర్ట్ పరిధి 4.3.21,కాకినాడ.


విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేడు కాకినాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల సుభ్రమణ్యం గారిని కలిసి రేపు జరుపుతున్న రాష్ట్ర బంద్ కి మద్దతు కోరగా ఆయన సంఘీభావం తెలిపారు, విశాఖ ఉక్కుని కాపాడుకునే భాద్యత అందరికి ఉందని పాఠశాల విద్యార్థిగా ఉన్నపుడే విశాఖ ఉక్కు కోసం విశాఖపట్నం లో ఉద్యమంలో నేరుగా పాల్గున్న విషయాన్ని గుర్తు చేశారు,న్యాయవాదులు మాజీ కార్యదర్శి ఎజాజుద్దీన్, సయ్యద్ సాలర్,ఇమామ్ మోహిద్దీన్,దౌరుల ఉదయ శంకర్,కొండేపూడి ఉదయ్ కుమార్,చక్రవర్తి,k. శ్రీనివాస్,సుధీర్ తదితర న్యాయవాదులు అందరు బంద్ కి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ హసన్ షరీఫ్, ట్రెజరర్ ర్.సతీష్, INTUC నాయకులు ఫణిశ్వర్ రావు తదితరులు పాల్గున్నారు.




Wednesday, 3 March 2021

టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక..

 టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక...


కాకినాడ, మార్చి 2; ది. కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

మంగళవారం ఉదయం స్ధానిక సిఐటియు కార్యాలయం లో యూనియన్ సర్వసభ్య సమావేశం వాలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. యూనియన్ కార్యదర్శి పి. రమేష్ గత కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు.  ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కరోనా లాక్ డౌన్ సమయంలో తొలి సారిగా తమ సభ్యులను ఆదుకొనే కార్యక్రమం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ చట్టం తెచ్చి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. దాని వల్ల భారీగా చలానా ఫీజులు, అపరాధ రుసుములు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో మందులను కూడా జి.ఎస్.టి.పరిధి లోకి తెచ్చిన కేంద్ర పాలకులు పెట్రోల్ డీజిల్ లను ఎందుకు జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ వాహనాలు తరచూ రిపేర్ కు వస్తున్నాయని పేర్కొన్నారు. మరొకవైపు స్పేర్ పార్ట్ ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ కార్మికుల జీవనం భారంగా మారుతోందన్నారు. అందువల్ల పాలకులు, అధికారులు ట్రాన్స్ పోర్ట్ రంగ కార్మికులపై భారాలు మోపే విధానాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కర్రి శ్రీనివాస్ అధ్యక్షుడు గా, శీలి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు గా, కె. వీరబాబు కార్యదర్శి గా, ప్రేమ్ కుమార్ సహాయ కార్యదర్శి గా, హేమ కుమార్ కోశాధికారి గా నూతన కమిటీ ఎన్నిక అయ్యింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ, కె. సత్తిబాబు లతో పాటు బాబూరావు, రాఘవ, మూర్తి, భాషా తదితరులు పాల్గొన్నారు...'''