వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడంతో వృద్ధులకు భద్రత కరువైందని అయినా పలు చట్టాల ద్వారా వీరికి రక్షణ కల్పించబడింది అని న్యాయవాది కే. శ్రీ రామ రాజు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిల్లల ఉన్నత కోసం పడిన తపన చేసిన కృషిని పిల్లలు గుర్తించడం లేదన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే వారి నుంచి నెల నెల కొంత మొత్తాన్ని భరణంగా పొందవచ్చన్నారు. భరణాన్ని చెల్లించకపోతే వారి సంతానానికి జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు .చట్టాల ద్వారా వృద్ధులకు రక్షణ ఉన్నా నేటి యువతలో పెద్దలను గౌరవించాలి అనే నైతిక పునాది అవసరమని శ్రీ రామ రాజు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రమణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి తదితర వాకర్స్ పాల్గొన్నారు.