Wednesday, 6 April 2022

ఆరోగ్యం తోనే సంతోషం మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉండదని - డాక్టర్ అడ్డాల సత్యనారాయణ

 ఆరోగ్యం తోనే సంతోషం మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉండదని ప్రముఖ వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు.

 సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యక్తి శారీరిక, మానసిక, భావోద్వేగ సంతులిత జీవన స్థితినే అసలైన ఆరోగ్యంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించిందని అన్నారు. మనదేశంలో మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ ,కంటి శుక్లాలు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు,

 టీ బి,  వినికిడి సమస్యలు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలు, స్థూలకాయం అనారోగ్యాలుగా గుర్తించబడ్డాయి అని అన్నారు.  పోషకాహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శుభ్రత, దురలవాట్లు లేకపోవడం, మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని డాక్టర్ అడ్డాల  తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు , రాజా తదితరులు పాల్గొన్నారు.





No comments:

Post a Comment

Please post your valuable comments