Wednesday, 6 April 2022

Centre assigns LGD codes to new districts formed in Andhra Pradesh

 ఏపీలో కొత్త జిల్లాలకు LGD కోడ్‌లు వచ్చాయి వివరాలివే.

Centre assigns LGD codes to new districts formed in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే.. కొత్త 13 జిల్లాల్లో అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ కొత్త జిల్లాలకు కేంద్రం ఎల్‌జీడీ (లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ) కోడ్‌లను కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌ (పీఈఎస్‌) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు.


కొత్త జిల్లాలకు కేటాయించిన కోడ్‌ వివరాలు.. పార్వతీపురం మన్యం-743, అనకాపల్లి-744, అల్లూరి సీతారామరాజు-745, కాకినాడ-746, కోనసీమ-747, ఏలూరు-748, ఎన్టీఆర్‌-749, బాపట్ల-750, పల్నాడు-751, తిరుపతి-752, అన్నమయ్య-753, శ్రీసత్యసాయి-754, నంద్యాల-755. కేంద్రం రాష్ట్రాలతో పాలనాపరమైన సంప్రదింపులు.. అలాగే వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో ఈ ఎల్‌జీడీ కొడ్లను ఉపయోగిస్తుంది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 చేరి ఆ సంఖ్య 26కు పెరిగింది. అలాగే కొత్తగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 72 డివిజన్లు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకుంది.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 26 జిల్లాలకు తోడు కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని తెలియజేశారు.

No comments:

Post a Comment

Please post your valuable comments