Showing posts with label indrapalam. Show all posts
Showing posts with label indrapalam. Show all posts

Sunday, 7 March 2021

ఇంద్రపాలెం వంతెన వద్ద శ్రమదానం తో గుంతలను పూడ్చిన డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు

 ఇంద్రపాలెం వంతెన వద్ద శ్రమదానం తో గుంతలను పూడ్చిన డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు....


ఇంద్రపాలెం మీదుగా భారీ వాహనాల రాకపోకలు నిషేధించి, రోడ్ నిర్మించాలని డిమాండ్....


కాకినాడ రూరల్, మార్చి 7; కాకినాడ - జి. మామిడాడ రోడ్ లో ఇంద్రపాలెం వంతెన వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) కార్యకర్తలు శ్రమదానం తో శనివారం రాత్రి పూడ్చారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కట్టా శ్యామ్‌ శేఖర్ మాట్లాడుతూ సామర్లకోట రోడ్ నుండి రామచంద్రాపురం, యానాం రోడ్ ల వైపు వెళ్ళవలసిన భారీ వాహనాలు, టిప్పర్ లు ఇంద్రపాలెం మీదుగా చీడిగ వద్ద నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 216 కు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ఇంద్రపాలెం గ్రామంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఒక మహిళ కూడా మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు ఇంద్రపాలెం వంతెన వద్ద మలుపు తీసుకోవడం తో పెద్ద పెద్ద గుంతలు పడి చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. చాలా సార్లు అధికారులకు విన్నవించాక ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ వారి డ్యూటీ సమయం లో వెళ్ళే వాహనాలను మళ్ళిస్తున్నారని వచ్చే వాహనాలు ఆగడం లేదన్నారు. అలాగే రాత్రి 9 గం. నుండి ఉదయం 9 గం. ల మధ్యలో వాహనాలు గ్యాస్ హారన్ లతో అత్యంత వేగంగా నడుపుతున్నారని, వీటికి అడ్డు కట్ట వేయాలని అధికారులను కోరుతున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తమ వంతు గా శ్రమదానం తో గుంతలను పూడ్చుతున్నామని , ఇది తాత్కాలిక పరిష్కారమేనని , శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో విస్తృత ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కృషి ని పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గుండుబోగుల శ్రీనివాస్, కె. సూర్య, సిహెచ్. విజయ్ కుమార్, సిహెచ్. త్రిమూర్తులు,గవర బాబ్జీ, వాసు దొరబాబు, శ్రీనివాస్, వి. రవి కుమార్, రోహిత్, కెవిపిఎస్ కార్యకర్త జి. సత్యానందం, మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు....