Thursday, 4 March 2021

ఆడపిల్ల దేశానికి గర్వకారణం


స్త్రీ పురుష సమానత్వం తోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని  ఇందుకుగాను ప్రతి ఒక్కరూ మహిళలను  గౌరవించాలని నారాయణ సేవ   అధ్యక్షురాలు ఎం. వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట లో  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ   వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు .మహిళలు అన్ని రంగాలలో సమానంగా రాణించాలంటే తమ హక్కులను కాపాడుకుంటూ విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవాలని వరలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవుల్లో  మహిళలకు గతంలో 33శాతం రిజర్వేషన్ ఉండేదని కానీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  50శాతానికి రిజర్వేషన్ పెంచి మహిళలకు ప్రజా సేవ చేసే   అవకాశం కల్పించి నందున వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలన్నారు .   అనంతరం  అడబాల ఆధ్వర్యంలో పత్రికా రంగంలో విలేకరిగా సేవలందిస్తున్న నందిని ని, సేవారంగంలో విస్తృతంగా  సేవలందిస్తున్న ఎం. వరలక్ష్మి, పివి  రాజేశ్వరి  లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణ మోహన్, రేలింగి బాపిరాజు,  డి సుబ్రమణ్యం, రాఘవ  రావు  , సత్యనారాయణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Please post your valuable comments