Wednesday, 3 March 2021

కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపు


కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపు 


. సిపిఐ రాష్ట్ర  కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపు.  


సామర్లకోట మార్చి 4 :ఒక్క ఓటు కమ్యూనిస్టు పార్టీకి వేయడం ద్వారా స్వచ్ఛమైన పాలనకు అభివృద్ధికి అభివృద్ధికి మలుపు గా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు గురువారం ఉదయం స్థానిక పదో వార్డు లో సప్త సూర్య  రామ కుమారి కి మద్దతుగా ఆయన  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్  జి లోవ రత్నం సామర్లకోట పట్టణ కార్యదర్శి పేదిరెడ్ల సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిపిఐ గెలుపు అంటే ప్రజాస్వామ్యానికి గెలుపుని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారని వర్గ వైరుధ్యాలతో స్థానిక సంస్థల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ కొన్నిచోట్ల గెలుపు కోసం సారా,  డబ్బు యథేచ్ఛగా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారని ప్రజాస్వామ్యాన్ని ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల గెలుపు అనివార్యమని అటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి గెలిపించ వలసిందిగా మున్సిపాలిటీలో తమ వాణిని వినిపించేందుకు గాను కమ్యూనిస్టు అభ్యర్థిని సూర్యకుమారి గారికి కంకి కొడవలి ఓటు వేయడం ద్వారా మున్సిపాలిటీ లో అవకాశం కల్పించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎలిశెట్టి రామదాసు, ఏఐటీయూసీ నాయకులు కామిరెడ్డి బోడకొండ, ప్రజానాట్యమండలి కళాకారులు పేదిరెడ్ల అర్జున్ రావు, అల్లూరు భద్�

No comments:

Post a Comment

Please post your valuable comments