Showing posts with label andhra. Show all posts
Showing posts with label andhra. Show all posts

Wednesday, 6 April 2022

ఏపీలో ఏకంగా 4775 పోస్టులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మెరిట్ ద్వారా ఎంపిక!

  ఏపీలో ఏకంగా 4775 పోస్టులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మెరిట్ ద్వారా ఎంపిక!


2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (CFW).. ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల పోస్టుల (Mid-Level Health Provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..



వివరాలు:


మొత్తం ఖాళీల సంఖ్య: 4775


పోస్టుల వివరాలు: మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు పోస్టులు


జిల్లాలవారీగా ఖాళీలు:


విశాఖపట్నం: 974


రాజమండ్రి: 1446


గుంటూరు:967


కడప:1368


వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.


పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.


అర్హతలు: బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్‌ కౌన్సిలింగ్‌లో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2022.

Centre assigns LGD codes to new districts formed in Andhra Pradesh

 ఏపీలో కొత్త జిల్లాలకు LGD కోడ్‌లు వచ్చాయి వివరాలివే.

Centre assigns LGD codes to new districts formed in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే.. కొత్త 13 జిల్లాల్లో అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ కొత్త జిల్లాలకు కేంద్రం ఎల్‌జీడీ (లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ) కోడ్‌లను కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌ (పీఈఎస్‌) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు.


కొత్త జిల్లాలకు కేటాయించిన కోడ్‌ వివరాలు.. పార్వతీపురం మన్యం-743, అనకాపల్లి-744, అల్లూరి సీతారామరాజు-745, కాకినాడ-746, కోనసీమ-747, ఏలూరు-748, ఎన్టీఆర్‌-749, బాపట్ల-750, పల్నాడు-751, తిరుపతి-752, అన్నమయ్య-753, శ్రీసత్యసాయి-754, నంద్యాల-755. కేంద్రం రాష్ట్రాలతో పాలనాపరమైన సంప్రదింపులు.. అలాగే వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో ఈ ఎల్‌జీడీ కొడ్లను ఉపయోగిస్తుంది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 చేరి ఆ సంఖ్య 26కు పెరిగింది. అలాగే కొత్తగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 72 డివిజన్లు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకుంది.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 26 జిల్లాలకు తోడు కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని తెలియజేశారు.

Wednesday, 3 March 2021

జులై 12 నుంచి ఎంసెట్‌AP EAMCET 2021 - Exam Date

 జులై 12 నుంచి  ఎంసెట్‌


బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

* అమరావతి:*

 ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.


మిగతా పరీక్షల్లో కొంత జాప్యం

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.


ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.