Wednesday, 3 March 2021

సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో - ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ ప్రసాద్

 సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదని కానీ వీటి వలనే రోజు రోజుకి వినికిడి సమస్యలు అధికమవుతున్నాయి  అని ప్రముఖ   ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ  ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో  బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శక్తివంతమైన స్మార్ట్ఫోన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం వలన వాటినుండి   అధిక రేడియేషన్ విడుదలై వినికిడి లోపం వస్తుందన్నారు. ఆధునిక జీవనశైలి ,పోషకాహార లోపం, మానసిక ఒత్తిళ్లు కూడా వినికిడి పై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఎక్కువ సమయం సెల్ఫోన్లలో  మాట్లాడ రాదన్నారు. చెవిలో నూనె వేయడం , ఇతర వస్తువులు పెట్టి  చెవిలో తిప్ప రాదని డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. అనంతరం హియరింగ్ కేర్ సెంటర్ ఆడియాలజిస్టు ఎన్ శ్రీను నాయక్ వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ గుబ్బల లక్ష్మన్న ప్రసాద్ , ఎన్ శ్రీను నాయక్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేలింగి బాపిరాజు, డి సుబ్రహ్మణ్యం, రాజా, పీ. త్రినాథ్, శ్రీ వాణి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు .



#ent #entdr #entdrkakinada #kakinada #kainadanews

జాతీయ నులుపురుగుల నివారణక దినోత్సవం




ఈ రోజు   నివారణ నిమిత్తం 1సంవత్సరం నుండి 19 సంవత్సరం లలోపు పిల్లల కు మాత్రలు పంపిణీ చేసిన రాష్ట్ర కార్యదర్శి లింగంరవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ANM హేమ వారి సిబ్బంది వారితో పాటుగా జిల్లా బిసి సెల్ కార్యదర్శి కొత్తపల్లి గిరీష్ పంచాయతీ కార్యదర్శి వెంకట రెడ్డి గారు తదితర నాయకులు #kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada


 చిగుళ్ల వ్యాధి ని అశ్రద్ధ చేయరాదు  మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే దంతాలు ముఖ్యం కాబట్టి చిగుళ్ల వ్యాధి వస్తే  వెంటనే వైద్యుల్ని సంప్రదించి సహజ దంతాలను కాపాడుకోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్  సువర్ణ రాజు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో ఆ గ్రామ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మెనోపాజ్ దశలో  మహిళలను చిగుళ్ల సమస్యలు వేధిస్తాయి అన్నారు. ఈ దశలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ స్థాయిలో విడుదలవుతుందని తద్వారా నోరు పొడిబారి దుర్వాసన వస్తుంది అన్నారు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని  డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు.   సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, సంఘ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు


#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada

ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్ ఏ పి జి విను - Happiness is the key for Success - Psychologist A PJ Vinu @ NSS Camp

 ప్రతినిత్యం ఆనందంగా గడపాలి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ఆనందంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలని  ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్  ఏ పి జి విను పేర్కొన్నారు. రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక  శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మనిషి జీవితంలో ప్రతిక్షణం విలువైనది అన్నారు. జీవితంలో సమస్యలు సహజమని అయితే ఆనందమే జీవిత పరమావధి కాబట్టి విద్యార్థి దశలో చక్కగా విద్య అభ్యసిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంటూ ఆనందంగా జీవించాలని  అన్నారు. చదువును కష్టంగా కాకుండా  ఇష్టంగా చదవాలన్నారు. వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ఎప్పుడు సానుకూల దృక్పథంతో మెలగాలని విను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజకుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి , వాలంటీర్లు పాల్గొన్నారు.



#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #nssunit #nssswamycollege #nssnews #psychologistapjvinu #vinu #apjvinu #ratnaprasadkakinada

Wednesday, 14 August 2013

Federation of Divion One Resident Welfare Assocaiton of Kakinada Colonys - Vaidyanagar , RTC colony, Padama Nagar on a Hunger Strike (Fast ) at Swarparvam Junciton for United Anddhar on 10 August 2913

Federation of Divion One Resident  Welfare Assocaiton of Kakinada  Colonys -  Vaidyanagar , RTC colony, Padama Nagar  on a Hunger   Strike (Fast ) at Swarparvam Junciton  for United Andhar on 10 August 2013