Wednesday, 3 March 2021

 చిగుళ్ల వ్యాధి ని అశ్రద్ధ చేయరాదు  మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే దంతాలు ముఖ్యం కాబట్టి చిగుళ్ల వ్యాధి వస్తే  వెంటనే వైద్యుల్ని సంప్రదించి సహజ దంతాలను కాపాడుకోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్  సువర్ణ రాజు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో ఆ గ్రామ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మెనోపాజ్ దశలో  మహిళలను చిగుళ్ల సమస్యలు వేధిస్తాయి అన్నారు. ఈ దశలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ స్థాయిలో విడుదలవుతుందని తద్వారా నోరు పొడిబారి దుర్వాసన వస్తుంది అన్నారు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని  డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు.   సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, సంఘ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు


#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada

No comments:

Post a Comment

Please post your valuable comments