Wednesday, 3 March 2021

ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న రాష్ట్ర బంద్


 ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న రాష్ట్ర బంద్ కు మద్దతు తెలపడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు అభినందనలు తెలియచెసారు .కార్మిక వర్గానికి అండగా ఉన్నందుకు వ్యాపార వర్గానికి ధన్యవాదములు వామపక్ష నాయకులూ ,కార్మిక సంఘాలు అన్నారు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ... జిల్లా కలెక్టర్ పి సి పాయిం

 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ...

 జిల్లా కలెక్టర్ పి సి పాయింట్స్...


 జిల్లా ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు...


 జిల్లాలోని నాలుగు విడతల్లో 34 వార్డులలో నామినేషన్ లేకపోవడం వలన మరల ఎన్నికల నిర్వహణ నిర్వహిస్తున్నాం...


 6వ తేదీన ఎన్నికల నామినేషన్, 7 వ తేదీన స్కూటీని, 8 వ తేదీన విత్ డ్రాలు, 10 తేదీన  ఎన్నికలు నిర్వహిస్తాం...


 34 వార్డు లో ఇప్పటికే సమాచారాన్ని అందించాం...


 ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం, అదేరోజు సాయంత్రం ఎన్నికలు ఫలితాలు ప్రకటిస్తాం...


 రబీ పంటకు సంబంధించి డిస్టిక్ అడ్వైజరీ బోర్డు లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అగ్రికల్చర్ సంబంధిత అధికారులతో ప్రతివారం సమావేశం నిర్వహిస్తున్నాం...


 రైతుల లో ఉన్న అపోహలు తొలగించేందుకే ఫీల్డ్ విజిట్ లు చేస్తున్నాం...




 జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పి సీ పాయింట్..


 మొదటి విడతలో కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లకు, రెండో విడతలో రెవెన్యూ, పోలీసులకు, మూడో విడతలో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో  250 రూపాయలు కట్టి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు...


 జనరల్గా కాకుండా covid-19 వెబ్సైట్లో కూడా   రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు....


 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ప్రతి ఒక్కరు వారికి ఉన్న ఇబ్బందులను డాక్టర్లు చెప్పి వ్యాక్సిన్ వేయించుకోవాలి....


 65 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన కార్డు పట్టుకొని వెళ్ళవలెను...


East Godavari joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., Inspected 1) Gram Sachivalayam 1, 2 and 3 of Vetlapalem (V), Samalkot (M)

 East Godavari joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., 

Inspected

1) Gram Sachivalayam 1, 2 and 3 of Vetlapalem (V), Samalkot (M) Today, Conducted Review on Beyond SLA services, YSR Bima, Aasara, Cheyutha, etc., Interacted with Sachivalayam Functionaries. 

2) Visited to SBI, Vetlapalem along with PD, DRDA, JD Animal Husbandry & staff and Verified the Milch Animals Loaning process at Bank under YSR Cheyutha



Joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., madam inspected APSWRS Social Welfare Res School at Pithapuram


Joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., madam inspected APSWRS Social Welfare Res School at Pithapuram.. Interacted with Students, Observed Facilities, Had lunch with Students on 02-03-2021. Tahsildar, Principal and RI Pithapuram attended. #APSWRSSocialWelfare  #APSWRS #socialwelfare  #pithapuram #rajakumari 

#jointcollectorrajakumari 

#jointcollector  #eastgodvaricollector #eastgodavari #ripithapuram #eastgodavaridist



జులై 12 నుంచి ఎంసెట్‌AP EAMCET 2021 - Exam Date

 జులై 12 నుంచి  ఎంసెట్‌


బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

* అమరావతి:*

 ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.


మిగతా పరీక్షల్లో కొంత జాప్యం

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.


ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.

Dist Collector D.Muralidhar Reddy @ Sachavalayam Staff at Golilla Peta, Jagannaickpur, Kakinada

 Dist Collector D.Muralidhar Reddy inspected 14A-14B Ward m on service requests,  Register books and interacted  Sachavalayam Staff at Golilla Peta, Jagannaickpur, Kakinada on 03-03-2021. Kkd Municipal commissioner and MHO participated. #Municipalcommissioner  #kakinda #kakinadmucipalcorporation #distcollector #DMuralidhar Reddy #CollectorDMuralidharReddy #SachavalayamStaff #Sachavalayam  #kkdmuncipal 




టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక..

 టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక...


కాకినాడ, మార్చి 2; ది. కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

మంగళవారం ఉదయం స్ధానిక సిఐటియు కార్యాలయం లో యూనియన్ సర్వసభ్య సమావేశం వాలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. యూనియన్ కార్యదర్శి పి. రమేష్ గత కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు.  ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కరోనా లాక్ డౌన్ సమయంలో తొలి సారిగా తమ సభ్యులను ఆదుకొనే కార్యక్రమం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ చట్టం తెచ్చి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. దాని వల్ల భారీగా చలానా ఫీజులు, అపరాధ రుసుములు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో మందులను కూడా జి.ఎస్.టి.పరిధి లోకి తెచ్చిన కేంద్ర పాలకులు పెట్రోల్ డీజిల్ లను ఎందుకు జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ వాహనాలు తరచూ రిపేర్ కు వస్తున్నాయని పేర్కొన్నారు. మరొకవైపు స్పేర్ పార్ట్ ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ కార్మికుల జీవనం భారంగా మారుతోందన్నారు. అందువల్ల పాలకులు, అధికారులు ట్రాన్స్ పోర్ట్ రంగ కార్మికులపై భారాలు మోపే విధానాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కర్రి శ్రీనివాస్ అధ్యక్షుడు గా, శీలి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు గా, కె. వీరబాబు కార్యదర్శి గా, ప్రేమ్ కుమార్ సహాయ కార్యదర్శి గా, హేమ కుమార్ కోశాధికారి గా నూతన కమిటీ ఎన్నిక అయ్యింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ, కె. సత్తిబాబు లతో పాటు బాబూరావు, రాఘవ, మూర్తి, భాషా తదితరులు పాల్గొన్నారు...'''