Friday, 5 March 2021

570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్​ఈసీ. Elecion news update

 570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్​ఈసీ. 


నగర పాలక, పురపాలిక, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది....


నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన నేపథ్యంలో... నగరపాలక, పుర, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20.68 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా వైకాపా అత్యధిక స్థానాలు దక్కించుకుందని ఎస్​ఈసీ వివరించింది.


 అధికార పార్టీ జోరు .


వైకాపా 570 స్థానాల్లో పాగా వేయగా తెదేపా ఐదు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఒక చోట భాజపా, రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఈసీ తెలిపింది..

వ్యాక్సిన్ తోనే కరోనా వైరస్ నివారణ

 వ్యాక్సిన్ తోనే  కరోనా వైరస్  నివారణ

 కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు   ఒక్క వైరస్ తోనే సాధ్యమని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా  అని ఎదురు చూశామని కానీ నేడు అందుబాటులోకి వచ్చిన తర్వాత   మీనమేషాలు  లెక్కించడం తగదన్నారు . వ్యాక్సిన్ వేయించుకోవడం వలన యాంటీ బాడీస్ వృద్ధిచెందుతాయి అన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 250 లు చెల్లించాల్సి ఉందన్నారు.    వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి అని     భౌతిక దూరం పాటించాలని డాక్టర్   సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, బాపిరాజు,  రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.




Kakinada Bandh March 5 Against Steel Plant Privatization


కాకినాడ బంద్ కార్యక్రమం లో సిఐటియు శ్రామిక మహిళలు..  





కాకినాడ భానుగుడి సెంటర్ లో బంద్ ర్యాలీ దృశ్యం.....




Thursday, 4 March 2021

కాకినాడ రూరల్ మండలం పండూరు '''జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు డీ - Accident on Kakinada Highway @ Panduru

 కాకినాడ రూరల్ మండలం పండూరు  '''జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు డీ... ఒకరి పరిస్థితి విషమం 


 వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు ఉమ్మడి కుటుంబ  వ్యవస్థలు విచ్ఛిన్నం కావడంతో వృద్ధులకు భద్రత కరువైందని అయినా పలు చట్టాల ద్వారా వీరికి రక్షణ కల్పించబడింది అని న్యాయవాది కే. శ్రీ రామ రాజు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిల్లల ఉన్నత కోసం పడిన తపన చేసిన కృషిని పిల్లలు గుర్తించడం లేదన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే వారి నుంచి నెల నెల కొంత  మొత్తాన్ని భరణంగా పొందవచ్చన్నారు. భరణాన్ని చెల్లించకపోతే వారి సంతానానికి జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు .చట్టాల ద్వారా  వృద్ధులకు రక్షణ ఉన్నా నేటి యువతలో పెద్దలను గౌరవించాలి అనే నైతిక పునాది అవసరమని శ్రీ రామ రాజు తెలిపారు.  సంఘ అధ్యక్షులు సుబ్రమణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి తదితర వాకర్స్ పాల్గొన్నారు.


వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్

 వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ      రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్ -అనిత దంపతుల సౌజన్యంతో పేద  కుటుంబానికి చెందిన వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ సృష్టిలో అన్ని జీవులకన్నా  మానవ జన్మ మహోత్కృష్టమైనదని దీనిని సార్థకం చేసుకోవడానికి గాను మానవసేవే మాధవ సేవగా సేవలు అందించాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ  సురేష్  అనిత  ల వివాహ దినోత్సవ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనలతో పాటు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.


APP in Kakinada - APP Voluntaries , Actively Participated in todays State Bandh , Against Privatization of Vishaka Steel Plant

 APP in Kakinada - APP Voluntaries , Actively Participated in  todays State Bandh , Against Privatization of Vishaka Steel Plant

కాకినాడ లో స్టీల్ ఫ్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా బంద్ కు మద్దతుగా (అప్ )ఆమ్ఆథ్మీ పార్టీ  జిల్లా కన్వీనర్ నరాల .శివ , కాళ్ళూరి కృష్ణమెహన్ ట్రైజరర్ &సేక్రటరి, జిల్లా నాయకులు  నాగులపాటి.సుబ్రహ్మణ్యం   అమ్మి రెడ్డి,ఆకెళ్ళ.లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు…