Wednesday, 3 March 2021

విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు 

 రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని 

సిపిఐ —ఏఐటీయూసీ ప్రదర్శన 


బంద్ తో మోడీకి గుణపాఠం రావాలి 


సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు 


మార్చి03:విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని దాని పరిరక్షణ కొరకు బంద్ జయప్రదం చేయాలని అదేవిధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు 5 న జరిగే రాష్ట్ర బంద్కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు .


బుధవారం ఉదయం రాజమండ్రి లో మెయిన్ రోడ్ లో ప్రదర్శన నిర్వహించారు 


ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు 


 రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు .ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కు కోసం 32 మంది విద్యార్థుల రక్తతర్పణం తో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని త్యాగధనులతో నిర్మించిన విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అందుకే ఐదో తేదీన జరిగే రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని జిల్లాలో ఉన్న వర్తక వాణిజ్య విద్యాసంస్థలు థియేటర్స్ పరిశ్రమలు అందరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు .


సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రేవిటీకరణ చాల హేయమైన చర్య అని అన్నారు .ప్రేవిటీకరణ ఆపకపోతే మరో చరిత్రతక పోరాటం చేస్తామని అన్నారు .రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలన్నారు 


జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ ఈ బంద్కు మిగతా రాజకీయ పార్టీ నాయకులు కలిసి రావాలని వారు కోరారు 


ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్ ,యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ ,ఉపాధ్యక్షులు పెంట దేవుడు ,వెంకట్రావు ,సహాయ కార్యదర్శి రోగుల మోహన్ కృష్ణ ,రెడ్డి వెంకట్ రావు కోశాధికారి కాళ్ళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Please post your valuable comments