రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ గా డాక్టర్ కుంభా రవి బాబు నియామకం... ఉత్తర్వులు విడుదల
Thursday, 4 March 2021
Ease of living kakinada @ 4 th place
తూర్పుగోదావరి జిల్లా
కాకినాడ
దేశంలో 10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లకు నిర్వహించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా నాలుగవ స్థానం దక్కింది..... గతంలో లో 64 వ స్థానంలో ఉన్న కాకినాడ ఈ ఏడాది నాలుగో స్థానం సాధించడం పట్ల అధికారులను అభినందించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్
విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా
విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా
రేపు మార్చి 05న *రాష్ట్రబంద్ కి మద్దతుగా విశాఖ ఉక్కు JAC కాకినాడ కూడా పాల్గొని మద్దతు తెలిపెందుకు తీర్మానించింది కావున రేపు మనం అందరం ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉదయం 09:00గం"లకు **రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ BR అంబెడ్కర్ గారి విగ్రహానికి పులా మాలలు వేసి నివాళి అర్పించిన** తరువాత బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలన కోరుతున్నాం.
ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించు వారు.
JAC కన్వీనర్, SC ST మానిటరింగ్ అండ్ విజిలెన్స్ జిల్లా సభ్యులు అయిత బత్తుల రామేస్వర రావు గారు
కో- కన్వీనర్ , ముస్లిం ఆలోచన పరుల వేదిక నాయకులు
హసన్ షరీఫ్ గారు
దళిత బహుజన గిరిజన ఐక్యవేదిక నాయకులు గూడాల కృష్ణ గారు
యునైటెడ్ SC ST ఫోరమ్ నాయకులు తుమ్మల నూకరాజు గారు
INTUC నాయకులు ఫనీశ్వర్ రావు గారు
భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి శివ గారు
ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షలు సిద్ధాంతాల కొండబాబు గారు
దళిత బహుజన ఫ్రంట్ నాయకులు చెంగల రావు గారు
బహుజన సమాజ్ వాదీ పార్టీ నగర అధ్యక్షులు సుబ్బారాపు అప్పారావు గారు
జన చైతన్య మండలి అధ్యక్షులు పావన ప్రసాద్ గారు
AIFTU నాయకులు R.సతీష్ గారు
ముస్లిం అద్వకేట్స్ అసోసియేషన్ నాయకులు జవహర్ ఆలీ గారు
రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ గారు
దళిత సత్తా అధ్యక్షులు కామేశ్వరరావు గారు
మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ గారు
విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.
విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.
పత్రికా ప్రకటన బార్ అసోసియేషన్ జిల్లా కోర్ట్ పరిధి 4.3.21,కాకినాడ.
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేడు కాకినాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల సుభ్రమణ్యం గారిని కలిసి రేపు జరుపుతున్న రాష్ట్ర బంద్ కి మద్దతు కోరగా ఆయన సంఘీభావం తెలిపారు, విశాఖ ఉక్కుని కాపాడుకునే భాద్యత అందరికి ఉందని పాఠశాల విద్యార్థిగా ఉన్నపుడే విశాఖ ఉక్కు కోసం విశాఖపట్నం లో ఉద్యమంలో నేరుగా పాల్గున్న విషయాన్ని గుర్తు చేశారు,న్యాయవాదులు మాజీ కార్యదర్శి ఎజాజుద్దీన్, సయ్యద్ సాలర్,ఇమామ్ మోహిద్దీన్,దౌరుల ఉదయ శంకర్,కొండేపూడి ఉదయ్ కుమార్,చక్రవర్తి,k. శ్రీనివాస్,సుధీర్ తదితర న్యాయవాదులు అందరు బంద్ కి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ హసన్ షరీఫ్, ట్రెజరర్ ర్.సతీష్, INTUC నాయకులు ఫణిశ్వర్ రావు తదితరులు పాల్గున్నారు.
ఏలేశ్వరం NH 16 వ నెంబరు జాతీయ రహదారి లో గొర్రెల మంద పై దూసుకెళ్లిన వాహనం
ఏలేశ్వరం NH 16 వ నెంబరు జాతీయ రహదారి లో గొర్రెల మంద పై దూసుకెళ్లిన వాహనం
కొట్టి ఈపు అప్పారావు అక్కడికక్కడే మృతి
12 గొర్రెలు మృతి 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం..
ఈపు అప్పారావు ది కిర్లంపూడి మండలం సింహాద్రిపురంగా గుర్తించిన పోలీసులు
నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ
నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వాలంటీర్లు నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ మా ట్లాడుతూ జీవించినంత కాలం కంటి చూపును అనుభవించాం కాబట్టి మరణానంతరం నేత్రదానం చేయడం వలన మరో ఇద్దరికీ కంటిచూపును ప్రసా దించినట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలన్నారు. ఏ వయసు వారైనా నేత్రదానం చేయవచ్చన్నారు. మధుమేహం, బిపి ఉన్న వారితో పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, జి కృష్ణ మోహన్, ఎన్ ఎస్ ఎస్ అధికారి, వాలంటీర్లు పాల్గొన్నారు
ఆడపిల్ల దేశానికి గర్వకారణం
స్త్రీ పురుష సమానత్వం తోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని ఇందుకుగాను ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం. వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు .మహిళలు అన్ని రంగాలలో సమానంగా రాణించాలంటే తమ హక్కులను కాపాడుకుంటూ విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవాలని వరలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు గతంలో 33శాతం రిజర్వేషన్ ఉండేదని కానీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50శాతానికి రిజర్వేషన్ పెంచి మహిళలకు ప్రజా సేవ చేసే అవకాశం కల్పించి నందున వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలన్నారు . అనంతరం అడబాల ఆధ్వర్యంలో పత్రికా రంగంలో విలేకరిగా సేవలందిస్తున్న నందిని ని, సేవారంగంలో విస్తృతంగా సేవలందిస్తున్న ఎం. వరలక్ష్మి, పివి రాజేశ్వరి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణ మోహన్, రేలింగి బాపిరాజు, డి సుబ్రమణ్యం, రాఘవ రావు , సత్యనారాయణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.