ఏలేశ్వరం NH 16 వ నెంబరు జాతీయ రహదారి లో గొర్రెల మంద పై దూసుకెళ్లిన వాహనం
కొట్టి ఈపు అప్పారావు అక్కడికక్కడే మృతి
12 గొర్రెలు మృతి 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం..
ఈపు అప్పారావు ది కిర్లంపూడి మండలం సింహాద్రిపురంగా గుర్తించిన పోలీసులు
ఏలేశ్వరం NH 16 వ నెంబరు జాతీయ రహదారి లో గొర్రెల మంద పై దూసుకెళ్లిన వాహనం
కొట్టి ఈపు అప్పారావు అక్కడికక్కడే మృతి
12 గొర్రెలు మృతి 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం..
ఈపు అప్పారావు ది కిర్లంపూడి మండలం సింహాద్రిపురంగా గుర్తించిన పోలీసులు
నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వాలంటీర్లు నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ మా ట్లాడుతూ జీవించినంత కాలం కంటి చూపును అనుభవించాం కాబట్టి మరణానంతరం నేత్రదానం చేయడం వలన మరో ఇద్దరికీ కంటిచూపును ప్రసా దించినట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలన్నారు. ఏ వయసు వారైనా నేత్రదానం చేయవచ్చన్నారు. మధుమేహం, బిపి ఉన్న వారితో పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, జి కృష్ణ మోహన్, ఎన్ ఎస్ ఎస్ అధికారి, వాలంటీర్లు పాల్గొన్నారు
. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపు.
సామర్లకోట మార్చి 4 :ఒక్క ఓటు కమ్యూనిస్టు పార్టీకి వేయడం ద్వారా స్వచ్ఛమైన పాలనకు అభివృద్ధికి అభివృద్ధికి మలుపు గా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు గురువారం ఉదయం స్థానిక పదో వార్డు లో సప్త సూర్య రామ కుమారి కి మద్దతుగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్ జి లోవ రత్నం సామర్లకోట పట్టణ కార్యదర్శి పేదిరెడ్ల సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిపిఐ గెలుపు అంటే ప్రజాస్వామ్యానికి గెలుపుని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారని వర్గ వైరుధ్యాలతో స్థానిక సంస్థల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ కొన్నిచోట్ల గెలుపు కోసం సారా, డబ్బు యథేచ్ఛగా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారని ప్రజాస్వామ్యాన్ని ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల గెలుపు అనివార్యమని అటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి గెలిపించ వలసిందిగా మున్సిపాలిటీలో తమ వాణిని వినిపించేందుకు గాను కమ్యూనిస్టు అభ్యర్థిని సూర్యకుమారి గారికి కంకి కొడవలి ఓటు వేయడం ద్వారా మున్సిపాలిటీ లో అవకాశం కల్పించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎలిశెట్టి రామదాసు, ఏఐటీయూసీ నాయకులు కామిరెడ్డి బోడకొండ, ప్రజానాట్యమండలి కళాకారులు పేదిరెడ్ల అర్జున్ రావు, అల్లూరు భద్�
చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు
సమాజ శ్రేయస్సు దృష్ట్యా చిన్నచిన్న తగాదాలతో భార్య భర్తలు విడాకులు కోరడం తగదని న్యాయవాది పి. ఏసుబాబు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏమైనా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే... వాటిని పెద్ద వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి అన్నారు. అలా వీలుకాని పక్షంలో కోర్టులలో ఉండే న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకు వస్తే సామరస్యపూర్వకంగా ఇరువురికి నచ్చజెప్పి తగురీతిలో న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అచట భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందడానికి కృషి చేస్తారన్నారు. అంతకు ఇద్దరి మధ్య పరిష్కారం కుదరకపోతే మహిళల తరఫున న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని యేసు బాబు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి ,కే శ్రీ రామ రాజు తదితరులు పాల్గొన్నారు.
...సిఐటియు విస్తృత సమావేశం పిలుపు...
కాకినాడ, మార్చి 3; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అశేష ప్రజల పోరాటాలతో , 32 మంది ప్రాణ త్యాగం తో సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేటి తరం ఐక్య ఉద్యమం లో కాపాడుకోవాలని సిఐటియు కాకినాడ నగర విస్తృత సమావేశం పిలుపు నిచ్చింది.
బుధవారం సాయంత్రం స్థానిక యుటిఎఫ్ టీచర్స్ హోం లో జి. కామశాస్త్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాలతో పాటు 68 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని అందించడం వల్ల విశాఖ ఉక్కు సాకారమైందన్నారు. 68 మంది వామపక్షాల ఎమ్మెల్యే లు, ఎంపీలు రాజీనామా లు చేసి పోరాడిన చరిత్ర ఉందన్నారు. సుమారు 2.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను కొరియా కు చెందిన పోక్సో అనే కంపెనీ కి కారుచౌకగా కట్టబెట్టడానికి కేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇప్పటికే చాలా అన్యాయం చేసారని పేర్కొన్నారు. తాజాగా దేశంలో నవరత్న హోదా కలిగి, లక్షా యాభై వేల మంది కి ప్రత్యక్షం గా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను దెబ్బకొడితే చూస్తూ ఊరుకోమన్నారు. దేశరాజధాని లో జరుగుతున్న రైతుల పోరాటం మోడీ దూకుడు కు కళ్ళెం వేసిందన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం గా సాగాలన్నారు. ఈ ఉద్యమం లో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ముందు వరుసలో నిలబడాలన్నారు. ప్రజలంతా ఈ ఉద్యమానికి అండగా నిలవాలని, మార్చి 5 రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు.
సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మార్చి 14 న జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాబ్జీ షేక్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రమళ్ళ పద్మ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ లతో పాటు సి.వెంకట్రావు, సిహెచ్. విజయ్ కుమార్, ఎం. రమణమ్మ, పద్మ, పాప, భారతి, తుపాకుల వీర్రాజు, గాంధీ, అర్జున్, నవీన్, బంగారు రామకృష్ణ, బండి గోపి, వర్రే రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు...
విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు
రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని
సిపిఐ —ఏఐటీయూసీ ప్రదర్శన
బంద్ తో మోడీకి గుణపాఠం రావాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
మార్చి03:విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని దాని పరిరక్షణ కొరకు బంద్ జయప్రదం చేయాలని అదేవిధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు 5 న జరిగే రాష్ట్ర బంద్కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు .
బుధవారం ఉదయం రాజమండ్రి లో మెయిన్ రోడ్ లో ప్రదర్శన నిర్వహించారు
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు
రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు .ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కు కోసం 32 మంది విద్యార్థుల రక్తతర్పణం తో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని త్యాగధనులతో నిర్మించిన విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అందుకే ఐదో తేదీన జరిగే రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని జిల్లాలో ఉన్న వర్తక వాణిజ్య విద్యాసంస్థలు థియేటర్స్ పరిశ్రమలు అందరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు .
సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రేవిటీకరణ చాల హేయమైన చర్య అని అన్నారు .ప్రేవిటీకరణ ఆపకపోతే మరో చరిత్రతక పోరాటం చేస్తామని అన్నారు .రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలన్నారు
జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ ఈ బంద్కు మిగతా రాజకీయ పార్టీ నాయకులు కలిసి రావాలని వారు కోరారు
ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్ ,యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ ,ఉపాధ్యక్షులు పెంట దేవుడు ,వెంకట్రావు ,సహాయ కార్యదర్శి రోగుల మోహన్ కృష్ణ ,రెడ్డి వెంకట్ రావు కోశాధికారి కాళ్ళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు