Friday, 8 April 2022

Kakinada New Commissioner Ch Narasimha Rao (FAC)

 కాకినాడ  నగరపాలక సంస్థ కమిషనర్ (FAC) గా శ్రీ సి హెచ్ నాగ నరసింహారావు

Kakinada New Commissioner  Ch   Narasimha Rao (FAC)

 Ch Naga Narasimha Rao on Friday took charge as Additional Commissioner of Kakinada Municipal Corporation  

 కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ( FAC) గా శ్రీ సిహెచ్  నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు పురపరిపాలనా శాఖ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్  శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం కమిషనర్ గా పనిచేసిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ కమిషనర్ గా  బదిలీ కావడంతో అదనపు  కమిషనర్ గా ఉన్న నాగ నరసింహారావును పూర్తి అదనపు  బాధ్యతలతో కమిషనర్ గా నియమించారు. శుక్రవారం సాయంత్రం ఆయన FAC కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎస్ ఈ సత్య కుమారి, మేనేజర్ సత్యనారాయణ, ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్వి చరణ్, RO రమణ, డీసీపీ శ్రీనివాస్, కార్యదర్శి ఏసుబాబు, గణాంక అధికారి శ్రీ కె ఎస్ శిరీష్ కుమార్ , తదితరులు  అభినందించారు.



Wednesday, 6 April 2022

వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవ సభలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

 వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవ సభలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల





Jaya Laxmi Co-Operative Banks / MAC Society Scam Kakinada

 

Jaya Laxmi Co-Operative Banks / MAC Society Scam Kakinada


కాకినాడలోని జయలక్ష్మి కోపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన వారు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మీ ఖాతాదారులతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నిండింది. డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు.  తక్షణమే తాము దాచుకున్న డిపాజిట్లను తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు.




ఆరోగ్యం తోనే సంతోషం మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉండదని - డాక్టర్ అడ్డాల సత్యనారాయణ

 ఆరోగ్యం తోనే సంతోషం మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉండదని ప్రముఖ వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు.

 సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యక్తి శారీరిక, మానసిక, భావోద్వేగ సంతులిత జీవన స్థితినే అసలైన ఆరోగ్యంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించిందని అన్నారు. మనదేశంలో మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ ,కంటి శుక్లాలు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు,

 టీ బి,  వినికిడి సమస్యలు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలు, స్థూలకాయం అనారోగ్యాలుగా గుర్తించబడ్డాయి అని అన్నారు.  పోషకాహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శుభ్రత, దురలవాట్లు లేకపోవడం, మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని డాక్టర్ అడ్డాల  తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు , రాజా తదితరులు పాల్గొన్నారు.





Kanna babu press met after District Bifurcation

 తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు. ఇటీవలే గుడ్ గవర్నెన్స్‌లో మేము మొదటి స్థానంలో నిలిచాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌పైనే.. నేడు అధికారంలో ఉన్నా జగన్ పైనే ఆయన విమర్శలు చేస్తున్నారు.      పవన్‌ బీజేపీ రోడ్‌ మ్యాప్‌ కాదు.. టీడీపీ రోడ్‌ మ్యాప్‌లో వెళ్లున్నారు. కౌలు రైతులు అంటూ టీడీపీ ఇచ్చిన మ్యాప్‌లో వెళ్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై పవన్‌ ఎందుకు స్పందించలేదు. మా పెట్టుబడి సాయం పథకమే రైతు భరోసా.. మీరు భరోసా ఇచ్చేదేంటి..?. విత్తనం నుంచి విక్రయం వరకూ మా ప్రభత్వుం రైతు వెన్నంటే ఉంది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా కౌలు రైతుల కార్డులు ఇచ్చాం. పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేయలేదు. కౌలు రైతులకు పీఎం కిసాన్‌ ఇవ్వాలని ఏనాడైనా కేంద్రానికి లేఖ రాశారా?. పవన్‌ది ఆవేశపూరిత రాజకీయం.. జగన్‌ది అర్థవంతమైన రాజకీయం' అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. '



ఏపీలో ఏకంగా 4775 పోస్టులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మెరిట్ ద్వారా ఎంపిక!

  ఏపీలో ఏకంగా 4775 పోస్టులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మెరిట్ ద్వారా ఎంపిక!


2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (CFW).. ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల పోస్టుల (Mid-Level Health Provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..



వివరాలు:


మొత్తం ఖాళీల సంఖ్య: 4775


పోస్టుల వివరాలు: మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు పోస్టులు


జిల్లాలవారీగా ఖాళీలు:


విశాఖపట్నం: 974


రాజమండ్రి: 1446


గుంటూరు:967


కడప:1368


వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.


పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.


అర్హతలు: బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్‌ కౌన్సిలింగ్‌లో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2022.

Pet dog bites Walker at Park - Pet Dog bites public on Road.

 ఒకటో డివిజన్ సచివాలయ కార్యదర్శి గారికి నమస్సులు. బోట్ క్లబ్  తూర్పువైపు రోడ్డు అనగా పర్యాటక శాఖ కార్యాలయం వీధిలో ఆ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఒక గృహంలో నుండి పెంపుడు కుక్క ఆ ఇంటికి కాంపౌండ్  వాల్  లేకపోవడంతో ఆకస్మాత్తుగా ఆ రోడ్డుపై వెళ్లే వాహనాల వెంట పరిగెడుతుంది. దీనివలన వాహనదారులు వేగం పెంచుతున్నారు. దీనివలన ప్రమాదాలు జరిగి గాయాల పాలవడం లేదా ప్రాణాలు పోయే పరిస్థితి  రావచ్చును .ఇటువంటి సంఘటనలు గతంలో మనందరం పేపర్లో చూశాము. నిన్న సాయంత్రం వాకింగ్ చేసుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తిని ఆ కుక్క ఆకస్మాత్తుగా వచ్చి కరవడం జరిగింది. పెంపుడు కుక్క ఐతే కట్టేసి ఉంచుకోవాలి.  వీధి కుక్క అయితే నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ కుక్కని  పట్టించాలి సిందిగా  కోరుచున్నాను. దయవుంచి ఉంచి ఈ విషయమై చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.








Centre assigns LGD codes to new districts formed in Andhra Pradesh

 ఏపీలో కొత్త జిల్లాలకు LGD కోడ్‌లు వచ్చాయి వివరాలివే.

Centre assigns LGD codes to new districts formed in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే.. కొత్త 13 జిల్లాల్లో అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ కొత్త జిల్లాలకు కేంద్రం ఎల్‌జీడీ (లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ) కోడ్‌లను కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌ (పీఈఎస్‌) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు.


కొత్త జిల్లాలకు కేటాయించిన కోడ్‌ వివరాలు.. పార్వతీపురం మన్యం-743, అనకాపల్లి-744, అల్లూరి సీతారామరాజు-745, కాకినాడ-746, కోనసీమ-747, ఏలూరు-748, ఎన్టీఆర్‌-749, బాపట్ల-750, పల్నాడు-751, తిరుపతి-752, అన్నమయ్య-753, శ్రీసత్యసాయి-754, నంద్యాల-755. కేంద్రం రాష్ట్రాలతో పాలనాపరమైన సంప్రదింపులు.. అలాగే వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో ఈ ఎల్‌జీడీ కొడ్లను ఉపయోగిస్తుంది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 చేరి ఆ సంఖ్య 26కు పెరిగింది. అలాగే కొత్తగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 72 డివిజన్లు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకుంది.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 26 జిల్లాలకు తోడు కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని తెలియజేశారు.

Police identified by CC camera footage as the work of a man with no discernment.

 కాకినాడ సబ్ డివిజన్ కార్యాలయం, 

కాకినాడ  జిల్లా, ది:06.04.2022.


🔹కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., గారి స్వీయ పర్యవేక్షణ మరియు ఆయన జారీ చేసిన ఆదేశాల మేరకు అన్నమఘాటి, పద్మనాభ నగర్ శ్రీ కనక దుర్గమ్మ మరియు అభయాంజనేయ స్వామి ఆలయంలో రాతి విగ్రహాలు ధ్వంసం చేసిన కేసును చేధించిన పోలీసులు.


🔹విచక్షణా జ్ఞానo  లేని ఒక వ్యక్తి చేసిన పనిగా CC కెమేరాల దృశ్యాల ద్వారా గుర్తించిన పోలీసులు.


ది.04.04.2022 సమయంలో కాకినాడ I టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్నమఘాటి సమీపంలో ఉన్నటువంటి పద్మనాభ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ మరియు అభయాంజనేయ స్వామి ఆలయంలో  ఉన్నటువంటి  ఆంజనేయ స్వామి మూల విరాట్ యొక్క రాతి విగ్రహాలను  మరియు కనకదుర్గ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చండి ప్రచండ విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసి సమీపంలో ఉన్న మురికి కాలువలో పడవేయడం అదేవిధంగా ఆలయం ప్రక్కన ఉన్న తులసి కోట తలభాగం మరియు గుడి గోడపై ఉన్న ధాన్య లక్ష్మి బొమ్మను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటనపై I టౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr.No.63/2022 U/s 153(a) 295, 427 IPC గా కేసు నమోదు కాబడి దర్యాప్తును ప్రారంభించడం జరిగిన విషయం అందరికీ విధితమే.


ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS, గారు కాకినాడ SDPO శ్రీ V.భీమారావు గారి పర్యవేక్షణలో కాకినాడ పట్టణంలో ఉన్న 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, సర్పవరం  మరియు పోర్ట్ పోలీస్ స్టేషన్ ల Inspector లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి SP గారి సమయానుకూల సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా సదరు దర్యాప్తు బృందాలు రంగంలోనికి దిగి ఈ కేసును అతి తక్కువ సమయంలో వివిధ సాక్షుల వాంగ్మూలాలను మరియు CC కెమెరాల యొక్క సాంకేతికతను   ఉపయోగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని గుర్తించడం జరిగింది.


ఇందులో అనుమానిస్తున్న  నిండుతుడు అర్ధరాత్రి సమయంలో ఈ ప్రాంతములో తిరుగుతూ ఉండే అలవాటు కలిగి ఉండి  4 వ తేదీ తెల్లవారు జామున సుమారు 12 గం. నుండి 1.30 గం. మధ్య సమయంలో ఈ కేసులో నేర స్థలం అయిన  శ్రీ కనక దుర్గ ఆలయం మరియు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద సంచరిస్తూ దేవత మూర్తులు ప్రతిమలను ఇష్టానుసారం తన పిచ్చి చేష్టలతో ధ్వంసం చేసి ఆలయం వెనుకనే ఉన్న మురుగు కాలువలో పడవేయడం జరిగినట్లుగా గుర్తించడమైనది. ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అతనికి విచక్షణ జ్ఞానo పెద్దగా లేనట్లు గుర్తించడం జరిగినది. 


ఆ వ్యక్తిని  గౌరవ కోర్టు వారి ముందు ప్రవేశ పెట్టి వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.


ఈ సంఘటన జగినప్పటి నుండి ఈ రోజు వరకు SP గారు స్వీయ నిర్దేశంలో దర్యాప్తు బృందాలు నిరంతరం  అందుబాటులో ఉన్న CC కెమెరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అతి తక్కువ సమయంలో ఈ కేసును చేధించడం జరిగింది.

 

త్వరితగతిన వాస్తవాలను వెలికి తీసినటువంటి కాకినాడ DSP Sri. V. Bhima Rao,  1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ మరియు సర్పవరం CI లను SP గారు ఈ సందర్భంగా  అభినందించడం జరిగింది.




*Kakinada Sub Division Office, * 

*Kakinada District, The: 06.04.2022. *


*🔹Kakinada District SP Shri M. Rabindranath Babu, IPS., Gary's self-monitoring and the police cracking the case of destruction of stone idols at Annamaghati, Padmanabha Nagar Shri Kanaka Durgamma and Abhayanjaneya Swamy Temple as per the orders issued by him. *


🔹Police identified by CC camera footage as the work of a man with no discernment.


During 04.04.2022 the stone statues of Anjaneya Swami Moola Virat and the Chandi Prachanda idols at the entrance of Kanakadurga were partially destroyed in the temple of Sri Kanaka Durgamma and Abhayanjaneya Swamy in Padmanabha Nagar near Annamaghati under Kakinada I Town Law and Order Police Station. Case filed as Cr.No.63 / 2022 U / s 153 (a) 295, 427 IPC at I Town Police Station on the incident of unidentified persons destroying the head of the Tulsi fort next to the temple and the Dhanya Lakshmi statue on the wall of the temple as well. It is a matter of course for everyone to register and initiate an investigation.


District SP Shri M. Rabindranath Babu, IPS, who took the case very seriously, under the supervision of Kakinada SDPO Shri V. Bhimarao set up special teams with Inspectors of 1st Town, 2nd Town, 3rd Town, Sarpavaram and Port Police Stations in Kakinada town. Following timely instructions and directions, the investigation team went into the field and in a very short time identified the culprit using the testimony of various witnesses and the technology of CC cameras.


*The suspect was in the habit of roaming the area around midnight around 4am on the 4th. From 1.30 p.m. In the meanwhile the crime scene in this case was found wandering around the Sri Kanaka Durga Temple and Abhayanjaneya Swamy Temple where the idols of the deity were destroyed at will with his madness and dumped in the sewer behind the temple. The man was taken into custody and interrogated and it was found that he lacked much discernment. * 


Arrangements will be made for the person to be admitted before the Honorary Court and sent for special medical examination as per their orders.


*Since the incident, SP's self-directed investigation teams have been cracking down on the case in the shortest possible time, using the technology of constantly available CC cameras. *

 

Kakinada DSP Sri. The SP congratulated V. Bhima Rao, 1st Town, 2nd Town, 3rd Town and Sarpavaram CI on the occasion.

Danger on Kakinada Roads | Smart City work without Safety | Save Lives | Safety Norms Missing

 

Danger on Kakinada Roads | Smart City work without Safety | Save Lives | Safety Norms Missing





Kakinada SmartCity RTO office is under Construction for past 2 years, Causing inconvenience topublic

 Kakinada Smart City RTO office is under Construction for past 2 years, Causing inconvenience to public . This road Work is a long pending , public are put to Toss with construction not being completed for years - no divider makings, no Lighting , no safety.

Even the Replay on Spandana is passive, they say they will complete, years passed, no Development , public are falling and accidents are quite common on this Road. కాకినాడ స్మార్ట్ సిటీలో ఒక రోడ్డు నిర్మాణానికి 2 + సంవత్సరాలా?



Andhra Pradesh Collectors and Sp numbers as on 6 March 2022

 Andhra Pradesh Collectors and Sp numbers  as on 6 March 2022