వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడంతో వృద్ధులకు భద్రత కరువైందని అయినా పలు చట్టాల ద్వారా వీరికి రక్షణ కల్పించబడింది అని న్యాయవాది కే. శ్రీ రామ రాజు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిల్లల ఉన్నత కోసం పడిన తపన చేసిన కృషిని పిల్లలు గుర్తించడం లేదన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే వారి నుంచి నెల నెల కొంత మొత్తాన్ని భరణంగా పొందవచ్చన్నారు. భరణాన్ని చెల్లించకపోతే వారి సంతానానికి జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు .చట్టాల ద్వారా వృద్ధులకు రక్షణ ఉన్నా నేటి యువతలో పెద్దలను గౌరవించాలి అనే నైతిక పునాది అవసరమని శ్రీ రామ రాజు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రమణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి తదితర వాకర్స్ పాల్గొన్నారు.
Thursday, 4 March 2021
వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్
వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్ -అనిత దంపతుల సౌజన్యంతో పేద కుటుంబానికి చెందిన వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ సృష్టిలో అన్ని జీవులకన్నా మానవ జన్మ మహోత్కృష్టమైనదని దీనిని సార్థకం చేసుకోవడానికి గాను మానవసేవే మాధవ సేవగా సేవలు అందించాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ సురేష్ అనిత ల వివాహ దినోత్సవ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనలతో పాటు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
APP in Kakinada - APP Voluntaries , Actively Participated in todays State Bandh , Against Privatization of Vishaka Steel Plant
APP in Kakinada - APP Voluntaries , Actively Participated in todays State Bandh , Against Privatization of Vishaka Steel Plant
కాకినాడ లో స్టీల్ ఫ్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా బంద్ కు మద్దతుగా (అప్ )ఆమ్ఆథ్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల .శివ , కాళ్ళూరి కృష్ణమెహన్ ట్రైజరర్ &సేక్రటరి, జిల్లా నాయకులు నాగులపాటి.సుబ్రహ్మణ్యం అమ్మి రెడ్డి,ఆకెళ్ళ.లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు…
Ease of living kakinada @ 4 th place
తూర్పుగోదావరి జిల్లా
కాకినాడ
దేశంలో 10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లకు నిర్వహించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా నాలుగవ స్థానం దక్కింది..... గతంలో లో 64 వ స్థానంలో ఉన్న కాకినాడ ఈ ఏడాది నాలుగో స్థానం సాధించడం పట్ల అధికారులను అభినందించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్
విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా
విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా
రేపు మార్చి 05న *రాష్ట్రబంద్ కి మద్దతుగా విశాఖ ఉక్కు JAC కాకినాడ కూడా పాల్గొని మద్దతు తెలిపెందుకు తీర్మానించింది కావున రేపు మనం అందరం ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉదయం 09:00గం"లకు **రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ BR అంబెడ్కర్ గారి విగ్రహానికి పులా మాలలు వేసి నివాళి అర్పించిన** తరువాత బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలన కోరుతున్నాం.
ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించు వారు.
JAC కన్వీనర్, SC ST మానిటరింగ్ అండ్ విజిలెన్స్ జిల్లా సభ్యులు అయిత బత్తుల రామేస్వర రావు గారు
కో- కన్వీనర్ , ముస్లిం ఆలోచన పరుల వేదిక నాయకులు
హసన్ షరీఫ్ గారు
దళిత బహుజన గిరిజన ఐక్యవేదిక నాయకులు గూడాల కృష్ణ గారు
యునైటెడ్ SC ST ఫోరమ్ నాయకులు తుమ్మల నూకరాజు గారు
INTUC నాయకులు ఫనీశ్వర్ రావు గారు
భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి శివ గారు
ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షలు సిద్ధాంతాల కొండబాబు గారు
దళిత బహుజన ఫ్రంట్ నాయకులు చెంగల రావు గారు
బహుజన సమాజ్ వాదీ పార్టీ నగర అధ్యక్షులు సుబ్బారాపు అప్పారావు గారు
జన చైతన్య మండలి అధ్యక్షులు పావన ప్రసాద్ గారు
AIFTU నాయకులు R.సతీష్ గారు
ముస్లిం అద్వకేట్స్ అసోసియేషన్ నాయకులు జవహర్ ఆలీ గారు
రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ గారు
దళిత సత్తా అధ్యక్షులు కామేశ్వరరావు గారు
మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ గారు
విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.
విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.
పత్రికా ప్రకటన బార్ అసోసియేషన్ జిల్లా కోర్ట్ పరిధి 4.3.21,కాకినాడ.
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేడు కాకినాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల సుభ్రమణ్యం గారిని కలిసి రేపు జరుపుతున్న రాష్ట్ర బంద్ కి మద్దతు కోరగా ఆయన సంఘీభావం తెలిపారు, విశాఖ ఉక్కుని కాపాడుకునే భాద్యత అందరికి ఉందని పాఠశాల విద్యార్థిగా ఉన్నపుడే విశాఖ ఉక్కు కోసం విశాఖపట్నం లో ఉద్యమంలో నేరుగా పాల్గున్న విషయాన్ని గుర్తు చేశారు,న్యాయవాదులు మాజీ కార్యదర్శి ఎజాజుద్దీన్, సయ్యద్ సాలర్,ఇమామ్ మోహిద్దీన్,దౌరుల ఉదయ శంకర్,కొండేపూడి ఉదయ్ కుమార్,చక్రవర్తి,k. శ్రీనివాస్,సుధీర్ తదితర న్యాయవాదులు అందరు బంద్ కి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ హసన్ షరీఫ్, ట్రెజరర్ ర్.సతీష్, INTUC నాయకులు ఫణిశ్వర్ రావు తదితరులు పాల్గున్నారు.